రాంసాగర్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వొజ్జపల్లి యాదగిరి ఏకగ్రీవ ఎన్నిక

బెజ్జంకి తెలుగు కే న్యూస్ జూలై 26
:బెజ్జంకి మండలంలోని రాంసాగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా వొజ్జపల్లి యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామస్థాయి నూతన కమిటీల ఏర్పాటు కార్యక్రమంలో ఈ ఎన్నిక జరిగినట్లు ఆయన ప్రకటించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షులు పార్టీ బలోపేతమే లక్ష్యంగా నిరంతరం కృషి చేయాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీ సిద్ధాంతాలు, నియమావళికి కట్టుబడి పనిచేయాలని కోరారు.అనంతరం నూతన గ్రామశాఖ అధ్యక్షుడు వొజ్జపల్లి యాదగిరిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాంసాగర్ గ్రామ సర్పంచ్ ఇంగాల లక్ష్మీ-నాగమల్లేశం, ఇంగాల సంజీవరావు, సవుల్ల సంతోష్, లోకటి రమేష్, ఇంగాల సత్తయ్య, ఆడుకుని రాజేశ్వరరావు, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రావుల సందీప్, కత్తి రమేష్, భూమయ్య, మహేందర్, రాజేశం, రమేష్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.