ఓటు హక్కును పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత.. వి. జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంపల్లి తెలుగు కె న్యూస్ ..
“ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ ఓటును పరిరక్షించుకోవాలి” అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
శనివారం మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్, స్టాలిన్ నగర్, ప్రశాంత్ నగర్ బస్తీలలో బీఎల్ఓలు, బీఎల్ఏలు, స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడు ఓటరు జాబితాలో నమోదు కావడానికి సహకరించాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో దొర్నాల రవికుమార్ గౌడ్, మన్నేపల్లి సాంబశివరావు, యలమంచి ఉదయ్ కిరణ్, నడి మింటి కృష్ణ, రాచ మల్ల భాస్కర్ గౌడ్, రవీందర్ రెడ్డి, కె. రాంబాబు, సి. సురేష్, నవీన్ నేత, శ్రీకాంత్ రాయికోటి, రాజారెడ్డి, బి. శ్రీకాంత్, సత్యరాజ్, రాఘవేంద్ర, నరసింహ, మల్లేష్, పాండు, ప్రశాంత్, భరత్, వాసు, హీరా వర్ణన్, ఓంకార్ , జి హెచ్ ఎం సి సూపర్వైజర్ రమేష్ కుమార్, పుష్ప, కావేరి, సుజాత, పావని, అనిత, తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.