కలుషిత తాగునీటిపై ముత్యంపల్లి గ్రామస్థుల ఆందోళన

 

సింగరేణి మైన్ ప్రధాన గేటు ముందు నిరసనకు దిగిన గ్రామ ప్రజలు

మంచిర్యాల జిల్లా జూలై 27 తెలుగు కే న్యూస్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా ముత్యంపల్లి గ్రామంలో కలుషిత తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో గ్రామస్థులు సోమవారం సింగరేణి మైన్ ప్రధాన గేటు ముందు ఆందోళనకు దిగారు. తాగునీరు కలుషితమై ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారిందని ఆరోపిస్తూ, వెంటనే స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు.
నిరసనలో పాల్గొన్న గ్రామస్థులు “శుద్ధమైన తాగునీరు మా హక్కు”, “కలుషిత నీటితో ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి”, “సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించాలి” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధులు మాట్లాడుతూ, సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, వెంటనే చర్యలు తీసుకుని ముత్యంపల్లి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని గ్రామస్థులు హెచ్చరించారు. మాజీ సర్పంచ్ వాడే బాధ తిరుపతి యాదవ్ టిఆర్ఎస్ మండల నాయకులు జగన్ రాజ్ హరీష్ బోయినీ సాయికిరణ్ ప్రసాద్ స్వామి తదితరులు పాల్గొన్నారు