బాసర మూలమలుపు గుంతలు నిండిన రహదారి.. ప్రయాణికులకు నిత్యం ఇబ్బందులు

నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-కేంద్రం నుంచి బాసర మూలమలుపు వైపు వెళ్లే ప్రధాన రహదారిపై భారీ గుంతలు ఏర్పడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బాసర మూలమలుపు సమీపంలోని సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడి ఇంటి వద్ద రహదారి పూర్తిగా దెబ్బతినడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారిపై గుంతలు మరింత పెరిగాయని, ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు, పాదచారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వెంటనే రహదారిపై ఉన్న గుంతలను పూడ్చి మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.