శీతల మాత ఆశీస్సులతో మద్దేపల్లి గ్రామం పులకరింత

 

నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం:- మద్దేపల్లి గ్రామంలో శీతల మాత పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళలు, యువతులు, చిన్నారులు అలంకరించిన బోనాలను తలపై మోసుకుని శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని శీతల మాతను వేడుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, సంప్రదాయ పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని శీతల మాతకు మొక్కులు చెల్లించి పండుగను వైభవంగా జరుపుకున్నారు. ఈ వేడుకలు మద్దేపల్లి గ్రామంలో భక్తి, సంప్రదాయం, సామూహిక ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :