నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం:- మద్దేపల్లి గ్రామంలో శీతల మాత పండుగను గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సంప్రదాయ బోనాలు సమర్పించగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గ్రామ ప్రజలు పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని శీతల మాతను ప్రార్థించారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Post Views:44
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.