పేదల పెళ్లి డబ్బుల కోసం నకిలీ సర్టిఫికెట్ల ముఠా అరెస్ట్ కామారెడ్డి పోలీసుల వలలో 3గురు – ఆన్‌లైన్ సెంటర్ సీజ్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పేరుతో ప్రభుత్వాన్ని, పేద కుటుంబాలను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్ చేశారు

బిక్కనూరు: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేరుతో పేదల పెళ్లిల కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు గుట్టు రట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
కామారెడ్డి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి RMO డాక్టర్ చందరి సంతోష్ ఈనెల 22- 07- 2026 న ఫిర్యాదు చేశారు.
తన సంతకం, అధికారిక సీల్ నకిలీగా వాడి వయస్సు, మొదటి పెళ్లి సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, డిజిటల్ రికార్డులతో భిక్కనూర్ మండల కేంద్రంలో చౌరస్తా వద్ద ఉన్న లహరి జిరాక్స్ & ఆన్‌లైన్ సెంటర్ పై దాడి చేశారు. రూ.5000 తీసుకొని నకిలీ పత్రాలు
విచారణలో అసలు విషయం బయటపడింది. భిక్కనూర్ కు చెందిన తోడెంగల రాజా నరేందర్, అతని తండ్రి రాజలింగం లు ఆన్‌లైన్ సెంటర్ నడుపుతూ, కళ్యాణలక్ష్మి దరఖాస్తు కోసం వచ్చే వారి నుండి ఒక్కొక్కరి దగ్గర రూ.4500 నుండి రూ.5000 వరకు వసూలు చేసేవారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ గా పనిచేస్తున్న భిక్కనూరు మండలం సిద్ధిరామేశ్వర్ నగర్ గ్రామానికి చెందిన బోయిని ప్రసాద్ తో కలిసి, డాక్టర్ల పేర్లతో నకిలీ సంతకాలు, నకిలీ రబ్బరు స్టాంపులు వేసి సర్టిఫికెట్లు రెడీ చేసేవారు. వాటిని అసలు పత్రాలుగా చూపి ఆన్‌లైన్ లో దరఖాస్తులు పెట్టి ప్రభుత్వ సొమ్ము కొట్టేయాలని ప్లాన్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు
1.తోడెంగల రాజా నరేందర్ (భిక్కనూర్)
2.తోడెంగల రాజలింగం (బిక్కనూరు)
3.బోయిని ప్రసాద్ (సిద్ధిరామేశ్వర్ నగర్) నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నవి 1 కంప్యూటర్ సెట్, 3 సెల్ ఫోన్లు, నకిలీ రబ్బరు సీల్స్, స్టాంప్ ప్యాడ్లు, పెన్నులు, నకిలీ దరఖాస్తుల డేటా. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. ఇంకా ఎంత మంది లబ్ధి పొందారు, ప్రభుత్వానికి ఎంత నష్టం అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ఎవరైనా నకిలీ పత్రాలతో దరఖాస్తు చేస్తే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తాం. కేసును సమర్థవంతంగా ఛేదించిన డీఎస్పీ, ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అభినందించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.