కవితను మర్యాదపూర్వకంగా కలిసిన టీఆర్ఎస్‌వీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు జె. రాము యాదవ్

హైదరాబాద్, తెలుగు కే న్యూస్ జూలై 30: టీఆర్ఎస్‌వీ (TRSV) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జె. రాము యాదవ్, సుమారు వెయ్యి మంది టీఆర్ఎస్‌వీ విద్యార్థులతో భారీ ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి టీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షబాధ్యతలుఅప్పగించినందుకు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని జీవితాంతం మరువనని, తనపై ఉంచిన విశ్వాసానికి తగ్గట్టుగా పనిచేస్తానని రాము యాదవ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థికి అన్యాయం జరిగినా టీఆర్ఎస్‌వీ తరఫున ముందుండి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సంస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.