
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అభివృద్ధికి మరో ముందడుగు వేశారు. హైస్కూల్ కు
నిన్న ఇచ్చిన మాట ప్రకారం స్టేజ్ షెడ్ రేకుల నిర్మాణం కోసం ఈ రోజు షెడ్ వెల్డర్‌ను పిలిపించి స్థలాన్ని పరిశీలించి కొలతలు తీసుకోవడం జరిగింది. ఇట్టి షెడ్డు రేకుల నిర్మాణానికి తనవంతుగా విరాళం అందజేసిన గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి మిత్రుడు. అలాగే షెడ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అడ్వాన్స్‌గా రూ. 50,000 అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జీడిపల్లి నర్సింహారెడ్డి ఉపసర్పంచ్ కోలా బాలాగౌడ్ స్కూల్ చైర్మన్ తగిరంచ సౌజన్య, హ్యూమన్ రైట్స్ జిల్లా చైర్మన్ దేవోల్లా రాములు, వార్డు సభ్యులు బట్టింకి రాజు, జనాపాల శ్రీకాంత్, దువ్వాళ పరమేష్, పెరమండ్ల నరసింహులు,బిజెపి పార్టీ గ్రామ అధ్యక్షులు ఏoకొళ్ల బాల్నర్స్, గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీమతి లావణ్య కారోబార్ గంగరాజు, ఫిల్డ్ అసిస్టెంట్ కొంగల భూమేష్, గ్రామ ప్రజలు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.





