ఎస్‌ఐఆర్‌ సర్వేలో 100% పూర్తి చేసిన అంగన్‌వాడీ టీచర్‌కు సన్మానం

నిజామాబాద్ జిల్లా, డొంకేశ్వర్ మండలంలోని :-గంగాసముందర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్‌) సర్వేను 100 శాతం విజయవంతంగా, పకడ్బందీగా పూర్తి చేసిన అంగన్‌వాడీ టీచర్ చంద్రకళను గ్రామపంచాయతీ పాలకవర్గం ఘనంగా సన్మానించింది.
ఈ సందర్భంగా బూత్ ఏజెంట్ల సూపర్వైజర్ మోత చిన్న సాయన్న, సర్పంచ్ తొగరి గంగామణి మహేష్‌లు ఆమె సేవలను అభినందిస్తూ శాలువాతో సత్కరించి ప్రశంసించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు సుర్కంటి చిన్నారెడ్డి, గడ్డం రాజవ్వ, నర్సారెడ్డి, పంచాయతీ కార్యదర్శి రాకేష్, కారోబార్ చిన్నయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ భీమన్న, ఆశా వర్కర్ లత, మహిళా సంఘాల వీవో సుస్మితతో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొని అభినందనలు తెలిపారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.