గుగ్గిళ్ల క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

 


గుర్తుతెలియని వాహనం ఢీకొట్టిందనే అనుమానం.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

బెజ్జంకి, తెలుగు కే న్యూస్ జూలై 30:  బెజ్జంకి మండలం గుగ్గిళ్ల క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బెజ్జంకి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేగులపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి జెల్ల రేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె భర్త జెల్ల శేఖర్ (35) ఈరోజు ఉదయం ఇంటి నుంచి కరీంనగర్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. అనంతరం ఉదయం సుమారు 7:35 గంటలకు గుగ్గిళ్ల క్రాస్ రోడ్ సమీపంలో మారుతి డిజైర్ కారులో తీవ్ర గాయాలతో కనిపించారు. స్థానికులు వెంటనే ఆయనను సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు ఉదయం 10:05 గంటలకు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, శేఖర్ శనిగరం నుంచి డైలీ సెల్ఫ్ డ్రైవ్‌కు తీసుకున్న మారుతి డిజైర్ కారులో కరీంనగర్ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఫిర్యాదుదారు అనుమానం వ్యక్తం చేశారు.
ఫిర్యాదు మేరకు బెజ్జంకి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రమాదానికి గల అసలు కారణాలు, గుర్తుతెలియని వాహనం వివరాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :