ప్రజల మధ్యే జీవించిన నేతకు ప్రజల అశ్రునివాళి.. ధర్మారెడ్డికి ఘన నివాళులు

కరీంనగర్ జిల్లా తెలుగు కే న్యూస్ గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కొమ్మెర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొమ్మెర రవీందర్ రెడ్డి తండ్రి కొమ్మెర ధర్మారెడ్డి గురువారం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో నిర్వహించగా, భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బంధుమిత్రులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై అశ్రునివాళి అర్పించారు.
మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ధర్మారెడ్డి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొమ్మెర రవీందర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, సామాజిక ప్రముఖులు, అభిమానులు పాల్గొని ధర్మారెడ్డికి ఘనంగా తుది వీడ్కోలు పలికారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడం ఆయనకు ఉన్న ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.