కె-24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారి నవీపేట ఏఎస్ఐ గఫర్‌కు ఏఎస్ఐగా పదోన్నతి నవీపేట

 

నవీపేట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న గఫర్‌కు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్ఐ) గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు పదోన్నతి గుర్తులను అధికారికంగా అలంకరించారు.
విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, ప్రజల పట్ల సేవాభావంతో పనిచేసిన గఫర్‌కు పదోన్నతి రావడం పట్ల సహచర పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఆయన భవిష్యత్తులో కూడా ఇదే సేవా స్పూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
పదోన్నతి పొందిన ఏఎస్ఐ గఫర్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.