లాస్ట్ మైల్ కనెక్టివిటీపై ఆటో కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలి: హరిప్రసాద్

కరీంనగర్: తెలుగు కే న్యూస్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం స్వయంగా ఎలక్ట్రిక్ ఆటోలను నడపాలనే నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉపాధి సంక్షోభంలో ఉన్న ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.ప్రభుత్వం తీసుకొచ్చే లాస్ట్ మైల్ కనెక్టివిటీ విధానంలో ఇప్పటికే ఆటోలు నడుపుతున్న డ్రైవర్లకే అవకాశం కల్పించాలని, పర్యావరణ పరిరక్షణ పేరుతో కార్మికుల ఉపాధికి భంగం కలిగించవద్దని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాల అమలుకు ముందు ఆటో యూనియన్లతో చర్చించి సబ్సిడీలు, రుణ సడలింపులు కల్పించాలని కోరారు. కరీంనగర్‌లో ప్రభుత్వ ఈవీ ఆటోలను ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తే ఆటో కార్మికులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.