గంగాధరనెల్లూరు శ్రీఆనంద నిలయ ఆశ్రమంలో ఘనంగా అన్నదానం

కె24న్యూస్ తెలుగు ఆగస్టు 01. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాధ ఆశ్రమం సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి శనివారం నిర్వహించే అన్నదానం, యోగా మరియు ధ్యాన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో తిరుపతి లక్ష్మీపతి, త్యాగారాజులు రెడ్డి, కె.బాబు రెడ్డి, రామక్రిష్ణ రెడ్డి, బి పట్టాభి రెడ్డి, ఇ.రఘునాథరెడ్డి, నరసింహ రెడ్డి, దామోదర్ రెడ్డి మరియు స్థానిక పాఠశాల విశ్రాంతి ఉపాధ్యాయులు కన్నయ్య పిళ్ళై పాల్గొని అన్నదాన వితరణ చేశారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.