నిజామాబాద్ దుబ్బ చౌరస్తాలో ఘనంగా బోనాల వేడుకలు

భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం.. డప్పు చప్పుళ్లు, పోతురాజు విన్యాసాలతో ఆధ్యాత్మిక సందడి
oplus_2097152
నిజామాబాద్ దుబ్బ ప్రాంతంలో ఆదివారం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహంకాళి అమ్మవారికి మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజు విన్యాసాలు, భక్తుల జైజై ధ్వనులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.

పండుగ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని ప్రత్యేక మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణతో పాటు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసంలో బోనాల వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.