మహిళామణులు స్నేహితుల దినోత్సవ సంబరాలు.

  1. నిజామాబాద్ జిల్లా, జక్రాన్ పల్లి మండలం, ఆగస్టు 03 తెలుగు కె న్యూస్ ప్రతినిధి,

జక్రాన్ పల్లి మండల కేంద్రంలో ఆగస్టు02,
తరాలు మారిన, తరగనిది. యుగాలు మారిన వెలకట్టలేనిది. కాలం మారిన, దూరాలు పెరిగిన, స్వచ్ఛమైనది. మాటలకందని భావం, మనసులను కలిపే బంధం. నేటి కాలంలో ఒకరికి ఒకరు తోడుగా నిలిచేది… కులాలు ఎరుగదు. మతాలు రుచి చూడదు.. శ్వాస, ధ్యాస.. అన్నిటిలో శాశ్వతంగా నిలిచేది స్నేహం.. ఇలాంటి స్నేహితుల దినోత్సవ సందర్భంగా మండలంలో పలువురు స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా మహిళా మణులు అనునిత్యం కుటుంబ బరువు బాధ్యతలతో ప్రయాణిస్తూ, గజిబిజి జీవితాన్ని గడుపుతూ, ఉంటారు. అలాగే వారు దైవభక్తి చింతనలో మమేకమై సాగుతూ, ఉంటారు. ముఖ్యంగా వివిధ గ్రామాల్లోని మహిళామణులు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఒకరికొకరు పరిచయమై స్నేహితులుగా మారి, ఒకరి యోగ క్షెమములు ఒకరు ప్రతినిత్యం తెలుసుకొని, మనసులో కల్మషం లేని స్నేహితులుగా సాగుతున్నారు. వారి స్నేహానికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆ దేవదేవుని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని, భక్త మార్గంలో నడుస్తూ, స్నేహితుల విలువను విస్మరించకుండా ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా, నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో రమ్య, లావణ్య, ప్రియా, భాగ్య,పూజిత, రాణి, మమత, అరుణ, సుధా, నీలిమ, సుకన్య తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.