మైసమ్మ వాగు తండకు ప్రత్యేక బస్సు సర్వీస్…

 

మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గ్రామ ప్రజల కృతజ్ఞతలు…

హుస్నాబాద్ ఆగస్టు. తెలుగు కే న్యూస్.2

. నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం మైసమ్మ వాగు తండ గ్రామపంచాయతీకి ప్రత్యేక బస్సు సర్వీస్ మంజూరు కావడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి రవాణా సౌకర్యం లేక విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రత్యేక బస్సు సర్వీస్ ప్రారంభం కావడం గ్రామ చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి గ్రామ ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల సమస్యను గుర్తించి వెంటనే స్పందించి బస్సు సౌకర్యం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

అలాగే ఈ బస్సు సర్వీస్ మంజూరు కోసం నిరంతరం కృషి చేసిన మైసమ్మ వాగు తండ గ్రామ సర్పంచ్ భూక్య కృష్ణ నాయక్ ని గ్రామ యువత ప్రత్యేకంగా అభినందించింది. ఇదే విధంగా గ్రామ అభివృద్ధికి మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.