చేర్యాల ఆర్‌అండ్‌బి రోడ్డు పునర్నిర్మాణానికి ఎంపీకి వినతి

చేర్యాల తెలుగు కే న్యూస్ అంగడి బజార్–ఆకునూరు ఆర్‌అండ్‌బి రోడ్డు అధ్వాన్న స్థితిలో ఉండటంతో దాని పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోడ్డు దుస్థితికి సంబంధించిన వివరాలు, మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం, రూ.3.76 కోట్ల అంచనా వ్యయ ప్రతిని ఎంపీకి సమర్పించారు. అలాగే చేర్యాలలో ఆర్‌అండ్‌బి డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కొమ్ము రాజేశ్వరి, మహమ్మద్ షరీఫా బేగం, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎం.డి. ఖాజా, శనిగారి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :