ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నిర్వహించిన ఈ ఆర్ ఫౌండేషన్.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, ఆగస్టు 06 తెలుగు కె న్యూస్ ప్రతినిధి,

ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా, ఈ ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ ఈరవత్రి రాజశేఖర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలను అనుసరిద్దాం అన్నారు. అధిక శాతం ఉన్న బీసీలందరూ ఆయన స్ఫూర్తితో జాగృతం కావాలన్నారు. కార్మికులు, శ్రామికులు, రైతులు, విద్యార్థులు, యువత, ప్రజలందరూ చైతన్యవంతులు కావాలన్నారు. పట్టు చేనేత చైర్మన్ గంగా మోహన్ చక్రు, ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు, అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కె.వి రమణ, నారా గౌడ్, ఈరవత్రి సురేందర్, విట్టోబ శేఖర్, బ్యాంకు నవీన్, సత్యన్న, కర్తన్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.