
తెలుగు కె న్యూస్ : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్‌బీఐ బ్యాంకుకు మహిళా సంఘం డబ్బులు జమ చేయడానికి వచ్చిన వ్యక్తి హీట్ స్ట్రోక్‌కు గురై మృతి చెందిన విషాద ఘటన గురువారం చోటుచేసుకుంది.జంగాపల్లి గ్రామానికి చెందిన బాలయ్య (60) మహిళా సంఘానికి సంబంధించిన నగదును గుండ్లపల్లి ఎస్‌బీఐ బ్యాంకులో జమ చేసేందుకు వచ్చారు. ఒక్కసారిగా కుప్పకూలారు. స్థానికులు వెంటనే స్పందించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






