నిజాయితీ,నిరాడంబర జీవనానికి ఆదర్శం ప్రొఫెసర్ జయశంకర్ సార్ టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆరోజు శ్రీనివాస్ సూచనల మేరకు జయశంకర్ సార్ వారసత్వం – నేటి తరం బాధ్యత అనే అంశంపై వ్యాసరచన కార్యక్రమాన్ని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టాస్క్ జిల్లా కన్వీనర్ డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించి గ్రామస్థాయిలో వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని,నిజాయితీ,నిరాడంబర జీవితానికి ఆదర్శం అని అన్నారు.తెలంగాణ సమస్యల పైన విద్యార్థులు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండాలని,తెలంగాణ కోసం అసలు బాసిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుతెరగాలని అన్నారు.నీళ్లు, నిధులు,నియామకాలను సాధించుకోవడానికి అవసరమైతే ఉద్యమ బాట పట్టడానికి సిద్ధం అవ్వాలని అన్నారు.సిరి చందన(ప్రధమ బహుమతి)విజన్ జూనియర్ కాలేజ్,పర్హాన (ద్వితీయ బహుమతి) సాందీపని డిగ్రీ కాలేజ్,జీవిత(తృతీయ బహుమతి),కన్సోలేషన్ బహుమతులు శ్రీలిక,దీర్ఘ లకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బహుమతులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న,విజన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నరేందర్ గౌడ్,సీనియర్ అధ్యాపకులు విజయ రామరాజు,టాస్క్ సభ్యులు కొంక దేవేందర్,కిషన్, బీమగౌడ్,ప్రశాంత్ లు పాల్గొనడం జరిగింది.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.