ఫార్మసిస్ట్ ఆత్మహత్య కేసులో ఇద్దరు ప్రెస్ రిపోర్టర్లు అరెస్ట్.

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

ప్రెస్ రిపోర్టర్లుగా పరిచయం చేసుకొని పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు ఓ ఫార్మసిస్టు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండు కు తరలించినట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డిస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమవేశంలో వివరాలను డీఎస్పీ మధుసూదన్ వెల్లడించారు. చేపూరి శిరీష అనే ఫార్మసిస్టు 2024లో ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగం,జీతం,సర్వీస్ వివరాలను RTI ద్వారా సేకరించి ఉద్యోగం కోల్పోయేల చేస్తామని, డబ్బులు డిమాండ్ చేస్తూ మానసికంగా వేధించినట్లు దర్యాప్తులో ఆధారాలు లభ్యమయ్యాయన్నారు.ఈ కేసులో ఇద్దరు రిపోర్టర్లు ఇందూరి సిద్ధాగౌడ్,లండే భాస్కర్లను అదుపులోకి తీసుకొని విచారించగా.. నేరానికి సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారన్నారు. వారిద్దరినీ రిమాండ్ కు తరలిస్తున్నట్లు కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ చెప్పారు. వీరు రీపోర్టర్లుగా పరిచయం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగులు,వ్యాపారులు, రియల్ ఎస్టేట్ వారిని లక్ష్యంగా చేసుకొని ప్రతికూల వార్తలు ప్రచురిస్తామని.. లేకుంటే అధికారులకు ఫిర్యాదులు చేస్తామని, ఉద్యోగాలు పోయేలా చేస్తామని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు లభించాయన్నారు.వీరిపై కామారెడ్డి,ఎల్లారెడ్డి,దోమకొండ, గాంధారి,దేవునిపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలో పలు కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. రిపోర్టర్ల పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ డీఎస్పీ మధుసూదన్ సూచించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.