

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మొక్కలు పెరిగితే గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు.
“మొక్క నాటుదాం.. పచ్చని మద్దేపల్లిని నిర్మిద్దాం” అంటూ గ్రామ ప్రజలకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెద్ద చెట్టుగా పెంచాలని పిలుపునిచ్చారు.
వర్షాకాలంలో మొక్కలు నాటడం ద్వారా వాటి పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో నిపుణులు కూడా సూచిస్తున్నారు.


