కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుల స్వీకరణ

నిజామాబాద్ జిల్లా,నవీపేట: మండల ప్రజల సమస్యల పరిష్కారానికి నవీపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నాగనాథ్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు.
మండలంలోని ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను ప్రజావాణి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో నాగనాథ్ సూచించారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.

ఇవి కూడా చదవండి :

తాజా వార్తలు చదవండి :