రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత DS

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్)ఆగష్టు 28. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు డి.సురేష్ రెడ్డి@DS రాష్ట్ర ప్రజలందరికీ రక్షాబంధన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకైన ఈ పవిత్ర దినం అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం నింపాలని ఆకాంక్షించారు. ఈ రాఖీ పౌర్ణమి ప్రజల జీవితాల్లో వెలుగులు పంచాలని, పరస్పర ప్రేమానుబంధాలు మరింత బలపడాలని ఆయన పేర్కొన్నారు. సహోదర భావంతో సమాజం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ గంగాధరనెల్లూరు మండల ప్రజలకు మరోసారి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.