పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.. బైక్ ర్యాలీకి పిలుపు

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 01. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో రేపు ఘనంగా నిర్వహించనున్నట్లు ఎస్.ఆర్ పురం జనసేన మండల అధ్యక్షులు కె.చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్.ఆర్ పురం మండలం కొత్తపల్లె మిట్ట అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కణ్ణాడీ మండపంలో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జనసేన శ్రేణులను ఉద్దేశించి అధినేత పవన్ కళ్యాణ్ విలువైన సందేశాన్ని అందించనున్నారని వెల్లడించారు. ఈ వేడుకల్లో నియోజకవర్గంలోని జనసేన నాయకులు, వీరమహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.