

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని, ఎన్నికల సమయంలో ప్రకటించిన గ్యారంటీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను పునరుద్ధరించి సాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం మినహా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఇతర హామీలు అమలుకాలేదని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అబ్బన్న, మండల అధ్యక్షుడు నర్సింగరావు, జిల్లా నాయకుడు తెడ్డుపోశెట్టి, అల్లం రమేష్, గైని వసంత్, వంజరి రాజేశ్వర్, మాజీ సర్పంచ్ ప్రవీణ్, వడ్డే రవి, శ్రీకాంత్, బబ్లు, శ్రావణ్, ఆఫీసర్ జావీద్, రైతులు సాయిబాబా, శ్యామ్, పోసాని తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ధర్నాను విజయవంతం చేశారు.


