తెలంగాణ సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేయాలి

మంచిర్యాల: తెలుగు కే న్యూస్ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పల్లెపల్లెనా ధూంధాంలతో ప్రజలను చైతన్యపరిచిన ఉద్యమ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు చొప్పదండి కిషన్, కొయ్యల లింగయ్య, బబ్బెర రాజేందర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వెయ్యి ఉద్యోగాల హామీని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీలో సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కళాకారుల సమస్యలపై చేసిన ప్రకటనలు కాలయాపనకే పరిమితమయ్యాయని విమర్శించారు.
గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కొందరికే ఉద్యోగాలు కల్పించి చేతులు దులుపుకున్నారని, ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అసలైన కళాకారులు నేటికీ ఉపాధి లేక దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు.లేనిపక్షంలో రాష్ట్రంలోని 33 జిల్లాల ఉద్యమ కళాకారులను ఏకతాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రస్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.