వింజపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

కోహెడ,K24NEWS సెప్టెంబర్ 15:
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా సోమవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని ఆధ్య కంటి ఆసుపత్రికి చెందిన డాక్టర్ బాలకిషన్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అన్నాడి శ్రీజ–జీవన్ రెడ్డి వైద్య శిబిరంలో సేవలందించిన డాక్టర్ బాలకిషన్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. గ్రామ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ కంటి పరీక్షలతో పాటు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి, అవసరమైన వారికి సిద్దిపేటలోని ఆధ్య కంటి ఆసుపత్రిలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ తెలిపారు.కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యులు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.