భూకొనపల్లి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.50 లక్షలు మంజూరు

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 15: k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి పట్టణంలోని 6వ వార్డులో ఉన్న భూకొనపల్లి ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, కామారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) , రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మంజూరైన నిధులతో ఆలయ అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షులు మల్లికార్జున్, డీసీసీ మాజీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు సందీప్, మండల అధ్యక్షులు రాజగౌడ్, కృష్ణారావు, సొసైటీ చైర్మన్లు గూడెం శ్రీనివాస్, ఇంద్రకరణ్ రెడ్డి, భీంరెడ్డి, సుధాకర్, స్థానిక కౌన్సిలర్ గంగాధర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బాలరాజు, కౌన్సిలర్లు అంజాద్, మజీద్, వాజీద్, జావీద్, సత్యం, చిట్టీబాబు, మహేష్, లడ్డు, కో-ఆప్షన్ మెంబర్ అలీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రెడ్డి నాయక్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుట్నాల శ్రీను, మండల అధ్యక్షులు రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు పండ్ల రాజు, సర్పంచ్ రేఖ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, అశోక్ రెడ్డి, గంప ప్రసాద్, తిరుమల స్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, లక్ష్మి, సుతారి రమేష్, యాదవరెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.