హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య

హమారా ప్రసాద్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రూసేగం భూమయ్య మాదిగ అన్నారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ముందు ధర్నా నిర్వహించారు.
హమారా ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందనీ అమర ప్రసాద్ పైన
దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అతని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని వారు ఎమ్మెల్యేలు ఎంపీలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్, రాసిన రాజ్యాంగం ద్వారానే పదవులు అనుభవిస్తున్నారని, అలాంటి మహనీయుని కించపరిచినట్టు మాట్లాడినటువంటి అమర ప్రసాద్ పైన దేశద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అతనిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు గంగారం
ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రవీందర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రవి జిల్లా యువసేన అధ్యక్షులు రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి వెండి యాదవరావు జిల్లా ప్రచార కార్యదర్శి రవి
సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు బలరాం
అంజయ్య ఎమ్మార్పీఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.