

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నవీపేట్ మెయిన్ చౌరస్తాలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ నవీపేట్ మండల అధ్యక్షుడు ద్యాగ సరిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి మోదీ దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు దేశ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు.
ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 7 గంటలకు మండలంలోని ప్రతి గ్రామంలో ఆలయాల వద్ద “ఆశీర్వాద దీపారాధన” కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు, యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మైస రాధా, ఐటీ సెల్ జిల్లా ఇన్‌చార్జ్ పిల్లి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శులు మంత్రి రాజేందర్ గౌడ్, నీరడి భూషణ్, మహంతం సర్పంచ్ సుంకరి రాజు, బీజేవైఎం మండల అధ్యక్షుడు బండారి రాజశేఖర్, పుట్టా శ్రీనివాస్ గౌడ్, గంగుని రాము, మోస్రా గోపాల్, గణేష్, కోరె గంగాధర్, భూమయ్య, వార్డు సభ్యులు ప్రేమ్‌సింగ్, భునాది నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


