
కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 18. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండలస్థాయి చెకుముకి పరీక్షలు నిర్వహించారు. మండలంలోని వివిధ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ తమ పాఠశాలల తరపున పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు.ఈ మండలస్థాయి చెకుముకి పరీక్షల్లో బల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. అనిగానూరు, రామకుప్పం బాలుర పాఠశాలలు ద్వితీయ స్థానం దక్కించుకోగా, చెలిగానిపల్లి పాఠశాల తృతీయ స్థానం సాధించింది.ప్రథమ స్థానం సాధించిన బల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక తరఫున బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. విజేతలైన విద్యార్థులను అధికారులు, ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మల్లికార్జున, రామకుప్పం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బల్ల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విజ్ఞాన శాస్త్ర అధికారి మోహన్ సింగ్, గణిత ఉపాధ్యాయులు బాబు తదితర పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం, విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి పరీక్షలు ఎంతో ఉపయోగకరమని జన విజ్ఞాన వేదిక నిర్వాహకులు తెలిపారు.


