

నవీపేట్ మండల:- పరిధిలో గురువారం కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రుడికి ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.


