
నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి, మండలం, సెప్టెంబర్ 21, తెలుగు కే న్యూస్ ప్రతినిధి,
ఖిల్లా డిచ్ పల్లి, గ్రామంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, డిచ్పల్లి ఎస్ఐ ఆరిఫ్ మాట్లాడుతూ,
వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.
వినాయక మండపాల నిర్వాహకులు నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలు, సలహాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
నిమజ్జన ఊరేగింపులో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
డీజేలు, శబ్ద కాలుష్యం విషయంలో నిబంధనలు పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.
మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, గొడవలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
భక్తులు భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనాన్ని విజయవంతంగా నిర్వహించుకోవాలని ఎస్ఐ ఆరిఫ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా మండపాల నిర్వహకులు పాల్గొన్నారు.


