లింగమయ్య గుట్ట కాలనీలో ఘనంగా అన్నదాన కార్యక్రమం, హోమం నిర్వహణ

నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలం:- పరిధిలోని లింగమయ్య గుట్ట కాలనీలో భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం మరియు ప్రత్యేక హోమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.
హోమ కార్యక్రమంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించగా, అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాలనీ ప్రజలు, పరిసర గ్రామాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని, భక్తి భావాన్ని మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.