
నిజామాబాదు జిల్లా సెప్టెంబర్ 21 : k24 న్యూస్ తెలుగు: ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శ్రీ సీతారామరాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో సోమవారం మహా అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. వినాయకునికి పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని దర్శించుకొని అన్న ప్రసాదం తీర్థప్రసాదాలు నిర్వహించారు. శ్రీ సీతా మహారాజ్ గణేష్ మండలి ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాదం కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతా మహారాజ్ గణేష్ మండలి సభ్యులు, యూత్ సభ్యులు, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


