నిజామాబాద జిల్లా, నవీపేట్ మండల్ :-అభంగపట్నం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం సర్పంచ్ శ్రీమతి గైని వసంత సతీష్ చేతుల మీదుగా గ్రామస్థులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపి గౌడ్, కార్యదర్శి ప్రియాంక, జీపీఓ రాజ్కుమార్, వార్డు సభ్యులు లక్ష్మి నర్సవ్వ, కొండ్ర గంగాధర్, బేగరి సురేష్, గ్రామ పెద్దలు పండ్ల శ్రీనివాస్, అసది రాజేందర్, మహిళా సంఘాల అధ్యక్షురాళ్లు స్రవంతి, గైని సురేఖ, సీఏలు చాకలి సుమ, నిరడి ప్రతిజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
Post Views:28
కె24 న్యూస్ తెలుగు
Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.