గణపతి నిమజ్జనంపై హిందు వాహిని సంస్థ సందేశం , 25న గణపతి శోభాయాత్రలు – మండపాల నిర్వాహకులు ఎలాంటి అయోమయానికి గురికావద్దని మందుల బాలు సూచన.

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, సెప్టెంబర్ 24, తెలుగు కె న్యూస్ ప్రతినిధి,
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణం, పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లి ప్రాంతాల ప్రజలకు హిందు వాహిని సంస్థ తరఫున జై శ్రీరామ్ మందుల బాలు అంటూ, సందేశాన్ని అందించారు.
గణపతి నిమజ్జనం విషయంలో భక్తులు, గణపతి మండపాల నిర్వాహకులు ఎలాంటి అయోమయానికి గురికావద్దని సూచించారు. సర్వసమాజ పెద్దలు, వేదపండితులు, పండితుల సూచనలు, సంప్రదాయాల మేరకు నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.
ఈ నెల 25వ తేదీన శుభదినాన గణపతి శోభాయాత్రలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నిమజ్జనం ఎప్పుడు అనే విషయంలో వస్తున్న సందేహాలకు తావులేకుండా, అన్ని గణపతి మండపాల నిర్వాహకులు ముందుగానే ఏర్పాట్లు చేసుకుని శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
అదేవిధంగా గణపతి ఉత్సవాల సందర్భంగా యువత సామాజిక బాధ్యతను కూడా గుర్తించాలని, హిందు వాహిని సంస్థ పిలుపునిచ్చింది. గణపతి ఉత్సవాల కోసం విరాళాలు సేకరించే సమయంలో, మండపం ఉన్న ప్రాంతంలోని దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాలలో, బాత్రూమ్‌లు, బెంచీలు, షెడ్లు తదితర అవసరాలకు కూడా కొంత మొత్తాన్ని కేటాయించాలని సూచించింది.
గణపతి ఉత్సవాల కోసం సేకరించిన మొత్తంలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా ఉత్సవాలకు మరింత అర్థవంతమైన రూపం వస్తుందని పేర్కొన్నారు. యువత సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.
హిందు వాహిని సంస్థ గత ఎన్నో సంవత్సరాలుగా సర్వసమాజ సహకారంతో లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ, వస్తోందని తెలిపారు. అదే స్ఫూర్తితో కొత్త తరం యువత కూడా సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుకు రావాలని మందుల బాలు పిలుపునిచ్చారు.
ఈ సంవత్సరం కూడా దేవాలయాలకు అవసరమైన సహాయ కార్యక్రమాలను చేపట్టేందుకు హిందు వాహిని సంస్థ ముందుకు వస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
“మన యువతకు సేవే ఆదర్శం… మన పండుగకు సామాజిక బాధ్యతే ప్రత్యేకత” అనే సందేశంతో యువత ముందుకు సాగాలని కోరారు.
అందరూ గణపతి శోభాయాత్రలో భక్తిశ్రద్ధలతో పాల్గొని, ప్రశాంతంగా మరియు విజయవంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలని హిందు వాహిని అధ్యక్షుడు మందుల బాలు, ఆర్మూర్ సర్వ సమాజ్ అధ్యక్షులు సభ్యులు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.