100కు ఫోన్ చేసినా.. పోలీసుల కోసం గంటల తరబడి ఎదురుచూపులు

 

K24NEWS వింజపల్లిలో జర్నలిస్ట్ ఇంట్లో చోరీ.. స్పందనపై బాధితుల ఆవేదన
కోహెడ: సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ఓ జర్నలిస్ట్ ఇంట్లో రాత్రి సమయంలో చోరీ జరిగింది. ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.చోరీ విషయం గుర్తించిన వెంటనే బాధితులు అత్యవసర సహాయం కోసం 100 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన వివరాలను 100 సిబ్బందికి తెలియజేయగా, కోహెడ మండల పోలీసులకు సమాచారం అందిస్తామని చెప్పినట్లు బాధితులు తెలిపారు.తర్వాత కోహెడ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో జరిగిన ఘటనపై కానిస్టేబుల్‌కు పూర్తి వివరాలను తెలియజేశారు. సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేస్తామని పోలీసులు చెప్పినప్పటికీ, గంటలు గడిచినా పోలీసులు రాకపోవడంతో బాధితులు ఆందోళనకు గురయ్యారు. తిరిగి పోలీసులకు ఫోన్ చేయగా ‘వస్తున్నాం’ అని సమాధానం ఇచ్చినప్పటికీ, సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.బాధితుల ఆవేదనఇంట్లో చోరీ జరిగిన వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చాం. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం అందుతుందని నమ్మి 100కు కాల్ చేశాం. కోహెడ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఫోన్ చేసి వివరాలు అడిగారు. సంఘటనా స్థలానికి వస్తామని చెప్పారు. కానీ గంటలు గడిచినా పోలీసులు రాలేదు. తిరిగి ఫోన్ చేసినా వస్తున్నామని మాత్రమే సమాధానం వచ్చింది. చోరీ జరిగిన ఇంటిని పరిశీలించేందుకు పోలీసులు సకాలంలో రాకపోవడం బాధాకరంగా ఉంది.” అని బాధితులు పేర్కొన్నారు.
“100కు ఫోన్ చేస్తే అత్యవసర సమయంలో పోలీసులు వెంటనే స్పందిస్తారని ప్రజలకు నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకంతోనే మేము 100కు కాల్ చేశాం. కానీ సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసుల కోసం గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. మరి ఆపదలో ఉన్నప్పుడు 100కు ఫోన్ చేస్తే ప్రజలకు సకాలంలో న్యాయం, రక్షణ ఎలా అందుతుంది?” అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.ప్రజల ప్రశ్నఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేసినప్పుడు సంబంధిత పోలీస్ సిబ్బంది ఎంత వేగంగా సంఘటనా స్థలానికి చేరుకుంటారు? సమాచారం అందిన వెంటనే ఎందుకు చర్యలు తీసుకోలేదనే అంశాలపై ఉన్నతాధికారులు పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు.చోరీ ఘటనపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి, దొంగలను గుర్తించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు, 100కు వచ్చిన ఫిర్యాదుపై జరిగిన స్పందనను కూడా అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని బాధితులు కోరుతున్నారు.

 

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.