శ్రీరామ్ తండాలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు (పచ్చ జొన్న )పంపిణీ

 

K24NEWS శుక్రవారం వ్యవసాయ పరిశోధన స్థానం, తోర్నాల మరియు భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ, హైదరాబాద్ వారి సౌజన్యంతో చిరు ధాన్యాలు మరియు విలువ ఆధారిత ఉత్పత్తులపై వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత ఆధ్వర్యంలో అవగాహన మరియు శిక్షణా కార్యక్రమాన్ని శ్రీరామ్ తండా గ్రామం అక్కన్నపేట్ మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జొన్న రకం పి.వై.పి.ఎస్-2 (పాలెం పచ్చ జొన్న-1) 50 మంది రైతులకు విత్తనాన్ని పంపిణి చేయడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోదన స్థానం, తోర్నాల శాస్త్రవేత్త మరియు అధిపతి డా. జి. సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ మన దేశంలో వ్యవసాయ సాగు విస్తీర్ణంలో దాదాపు 60 శాతం ప్రాంతంలో వర్షాధారంగా సేద్యం చేస్తున్నారు. వీటిలో తృణధాన్యాల సాగు 75 శాతం కాగా, దీనిలో ముతక తృణధాన్యాలైన జొన్న అధికంగా సాగవుతున్నాయని తెలిపారు. చిరుధాన్యాల సాగు చాలా తక్కువ నీటి వసతిలో, తక్కువ పెట్టుబడితో, తక్కువ వనరులతో, తక్కువ రసాయన మందులతో కూడుకున్నది. కాబట్టి, వర్షాధార భూములు, నామమాత్రపు లోతు ఉన్న నేలల్లో, భూసారం తక్కువగా ఉన్న నేలలు లాంటి చాలా ప్రత్యామ్నాయ పరిస్థితులలో వీటిని ఏమాత్రం దిగుబడులు తగ్గకుండా సాగు చేయవచ్చునని తెలిపారు. ఆర్థిక, ఆహార, ఆరోగ్య భద్రతనిచ్చే చిరుధాన్యాల సాగుకు ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తున్నది కావున రైతులు వీటిని సాగు చేయలని తెలిపారు .ప్రస్తుత ఎల్ నినో పరిస్థితులలో వివిధ పంటలతో పోల్చుకున్నపుడు ఈ జొన్న పంట తక్కువ నీటి వసతితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. తర్వాత తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం, సిద్దిపేట శాస్త్రవేత్త పల్లవి గారు మాట్లాడుతూ పి.వై.పి.ఎస్-2 (పాలెం పచ్చ జొన్న-1) రకం వానాకాలం మరియు యాసంగి కాలాల సాగుకు అనుకూలంగా ఉంటుంది. పి.వై.పి.ఎస్-2 జొన్న రకం పంట కాలం సుమారు 100–110 రోజులు ఉండి తక్కువ ఎత్తు పెరుగుతుంది. ఈ రకం గింజ బూజు తెగులును, మొవ్వు చంపు ఈగ, కాండం తొలుచు పురుగులను తట్టుకుంటుంది, దిగుబడి ఎకరానికి 10 -12 క్వింటాళ్ళ వరకు వస్తుందని, దీనిని పశువుల మేతకు ఉపయోగించినట్లైతే ఎకరానికి 50-55 క్వింటాళ్ళ చొప్ప వస్తుందని, ఈ రకం రైతులకు వివిధ పంటలకు లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటగా నిలుస్తుందని తెలిపారు. తర్వాత డా. డి. శ్వేత మాట్లాడుతూ జీవనరుల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. తర్వాత డా. ఎ. సరిత మాట్లాడుతూ వివిధ పంటలలో విత్తన ఉత్పత్తి గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని తస్లీమా సుల్తానా, అక్కన్నపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్, శ్రీరామ్ తండా గ్రామ సర్పంచ్ బానోత్ వెంకటేష్, ఉప సర్పంచ్ రాజు, పంచాయతి సెక్రటరీ మరియు శ్రీరామ్ తండా గ్రామ రైతులు 50 మంది పాల్గొన్నారు

 

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.