దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె వాయిదా!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 28. దేశ వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా బ్యాంకు ఉద్యోగుల సంఘాలు తమ ప్రతిపాదిత సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరియు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధుల మధ్య నిర్వహించిన చర్చలు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకులకు అన్ని శనివారాలు అధికారికంగా సెలవులు ప్రకటించాలనే ముఖ్య డిమాండ్పై సమగ్ర పరిశీలన జరిపేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసేందుకు ఐబీఏ అంగీకరించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఎప్పటిలాగే సాధారణంగా పనిచేయనున్నాయి. ఫలితంగా సాధారణ ప్రజలకు, ఖాతాదారులకు తీవ్ర ఊరట లభించింది.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.