షహీద్ భగత్ సింగ్ నేటి యువతకు స్ఫూర్తి – వడ్ల సాయికృష్ణ

కామారెడ్డి జిల్లా సెప్టెంబర్28 :k24 న్యూస్ తెలుగు : షహీద్ భగత్ సింగ్ 119వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి లో BDSF కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు చౌకి ప్రసాద్ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి BDSF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వడ్ల సాయికృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వడ్ల సాయికృష్ణ మాట్లాడుతూ.. భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ లోని బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించారని, 13 ఏళ్ల వయసులో జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయనను కదిలించిందని అన్నారు. లాలా లజపతిరాయ్, కర్తార్ సింగ్ సరభా ఆయనకు స్ఫూర్తి అని, లాహోర్ నేషనల్ కాలేజీలో చదువుతూ 1924లో నౌజవాన్ భారత్ సభను స్థాపించి, తరువాత HSRA లో కీలక నాయకుడిగా ఎదిగారని తెలిపారు.

సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో లాలాజీ మరణానికి ప్రతీకారంగా బ్రిటిష్ అధికారిపై దాడి చేయడం, సెంట్రల్ అసెంబ్లీలో బాంబు వేసి “ఇంక్విలాబ్ జిందాబాద్” అంటూ లొంగిపోవడం, జైల్లో 116 రోజులు నిరాహార దీక్ష చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు.

1931 మార్చి 23న కేవలం 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరితీశారని, ఆయన ఆశయం కేవలం స్వాతంత్ర్యమే కాదు, కులం, మతం, పేదరికం లేని సోషలిస్ట్ భారతదేశమని, ఆయన త్యాగం బహుజన, యువ, విద్యార్థి ఉద్యమాలకు ఎప్పటికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.