

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమవుతున్నాయి. సన్న వడ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఈ సీజన్లో లాభాలు వస్తాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సకాలంలో మార్కెటింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉంటే రైతులకు మరింత మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.


