
కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 29: k24 న్యూస్ తెలుగు :గత 35 సంవత్సరాలుగా యశోద ఆసుపత్రి ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోందని వైద్యులు తెలిపారు.గతంలో మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు క్లిష్టమైన ప్రక్రియగా ఉండేవని, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంతో మరింత కచ్చితత్వంతో శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం ఏర్పడిందని డాక్టర్ వినయ్ కుమార్ తెలిపారు. రోగి మోకాలి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, అందుకు అనుగుణంగా శస్త్రచికిత్సను ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా నిర్వహించవచ్చని వివరించారు.తాను ఇప్పటివరకు వెయ్యికి పైగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించినట్లు డాక్టర్ వినయ్ కుమార్ వెల్లడించారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగుల నుంచి సంతృప్తికరమైన స్పందన లభిస్తోందని తెలిపారు.ఈ సందర్భంగా మోకాలి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న కామారెడ్డి ప్రాంతానికి చెందిన రాజారెడ్డి, అంతంపల్లికి చెందిన రాకేష్ తమ అనుభవాలను విలేకరులతో పంచుకున్నారు. డాక్టర్ వినయ్ కుమార్ తమకు శస్త్రచికిత్స నిర్వహించారని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడవగలుగుతున్నామని తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం తమ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వారు సంతోషం వ్యక్తం చేశారు.మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వైద్య నిపుణులను సంప్రదించి తగిన చికిత్స పొందాలని డాక్టర్ వినయ్ కుమార్ సూచించారు. రోగి ఆరోగ్య పరిస్థితి, మోకాలి సమస్య తీవ్రతను బట్టి తగిన శస్త్రచికిత్స విధానాన్ని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.


