
కామారెడ్డి జిల్లా సెప్టెంబర్29: k24 న్యూస్ తెలుగు :జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), న్యూఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి దేవేంద్ర కుమార్ నిమ్ మంగళవారం కామారెడ్డి జిల్లాకు పర్యటన సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలుసుకుని పూల మొక్కను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం శ దేవేంద్ర కుమార్ నిమ్ ఎల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్తో కలిసి తదుపరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాంధారి మండలానికి బయలుదేరారు.


