

రైతులకు సాగునీరు అందించేందుకు నిజాంపూర్–లింగాపూర్ ఎత్తిపోతల పథకం ఉన్నప్పటికీ.. తమ పొలాలకు నీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తిపోతల పథకం ఉన్నా ఉపయోగం లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. ఎమ్మెల్యే గారి స్వగ్రామం సమీపంలోనే ఈ పరిస్థితి నెలకొనడంపై కూడా రైతులు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.
ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి తమ పంటలకు సాగునీరు అందించాలని రైతులు అధికారులను కోరుతున్నారు.


