మండల స్థాయిలో పోషణ మాసం కార్యక్రమం

నిజామాబాద్ జిల్లా,నవీపేట మండల్ :- మహిళా శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసం–2026లో భాగంగా ‘‘మన అంగన్‌వాడీ–మన బాధ్యత’’ కార్యక్రమాన్ని మండల స్థాయిలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా డిచ్‌పల్లి ప్రాజెక్టు సీడీపీఓ ఫర్హత్‌ గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పిల్లల వయస్సుకు తగిన అనుబంధ ఆహారం, ఆహార వైవిధ్యం, ప్రొటీన్‌ అధికంగా ఉండే ఆహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈసీఈఈ డే ప్రాముఖ్యతను వివరించారు.
పోషణ మాసం సందర్భంగా తల్లులకు క్విజ్‌ పోటీ నిర్వహించి బహుమతులు అందజేశారు. టీచర్స్‌ డే సందర్భంగా ఉత్తమ అంగన్‌వాడీ ఉపాధ్యాయులకు బహుమతులు ప్రదానం చేశారు. ‘‘బలమైన బాల్యానికి 1000 మెట్లు’’ కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయి కార్యకర్తలకు కౌన్సెలింగ్‌ పుస్తకాలను అందజేశారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గైనీ వసంత సతీష్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ ప్రధానోపాధ్యాయులు మల్లేష్‌, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రావణ్‌, ఎంఎల్‌హెచ్‌పీ సాయిరామ్‌, ఏఎన్‌ఎం ప్రియాంక, ఐకేపీ సీసీ జ్యోతి, సుమలత, ప్రతిభ, వార్డు సభ్యులు, వీఆర్‌డీసీ సభ్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు, తల్లులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.