నవీపేట్ లో చిన్నారుల పోషణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

నిజామాబాద్ జిల్లా,నవీపేట్: మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించిన పోషకాహార మహోత్సవ కార్యక్రమంలో బీజేపీ నవీపేట్ మండల అధ్యక్షుడు, నాళేశ్వర్ మాజీ సర్పంచ్ ద్యాగ సరిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణ విషయంలో అంగన్‌వాడీ టీచర్లు ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారని అన్నారు.
చిన్నారులకు చిన్న వయస్సు నుంచే పౌష్టికాహారం అందించడం ద్వారా వారి శారీరక, మానసిక ఎదుగుదలకు బలమైన పునాది ఏర్పడుతుందని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారం ప్రతి చిన్నారికి సక్రమంగా అందేలా అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. గర్భిణీలు, బాలింతలకు అందించే పోషకాహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం అంగన్‌వాడీ టీచర్లు చేస్తున్న సేవలు అభినందనీయమని, వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ద్యాగ సరిన్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల తహసీల్దార్, ఎంపీడీవో, మండల వైద్యులు, అంగన్‌వాడీ టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.